విశాఖపట్నం దేవీ నవరాత్రుల పురస్కరించుకొని బుధవారం దక్షిణ నియోజకవర్గం 29వ వార్డు పరిధిలో అంగడిదిబ్బలో వెలసిన అమ్మవారి ఆలయ నిర్వాహకులు అన్నదాన కార్యక్రమానికి 29వ టిడిపి అధ్యక్షులు ఉరుకుటి గణేష్ ని ఆహ్వానించడం జరిగింది. కమిటీ వారి ఆహ్వాన మేరకు తెలుగుదేశం అధ్యక్షులు గణేష్ విచ్చేసి అమ్మ వారి ప్రసాదాన్ని భక్తులకు వడ్డించారు, ఈ కార్యక్రమంలో వార్డు జనరల్ సెక్రటరీ రాయన బంగారురాజు, పళ్ల లక్ష్మి, ఒమ్మీ వెంకట అప్పారావు, కొండ్రు శ్రీను, దళాయి కిషోర్, పోలిపల్లి కృష్ణ టిడిపి కమిటీ మెంబర్ లు పాల్గొన్నారు.
