Tv424x7
Telangana

ముత్యాలమ్మ టెంపుల్ ఘటనపై పోలీసుల ప్రకటన..ఏకంగా 3,000 మంది..!!

ముత్యాలమ్మ టెంపుల్ ఘటనపై పోలీసులు ప్రకటన చేశారు. దాదాపు 3,000 మంది ముత్యాలమ్మ టెంపుల్ వద్ద కు వచ్చారని… అనుమతి లేకుండా ర్యాలీ తీసేందుకు ప్రయత్నం చేశారని తెలిపారు పోలీసులు.పక్కనే ఉన్న ప్రార్ధన మందిరం మీదికి దూసుకెళ్లి ధ్వంసం చేసే ప్రయత్నం చేశారన్నారు. రాళ్లు ..బాటిల్స్ తో దాడికి దిగారు.. ధ్వంసం చేసే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు.మోబ్ ను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నాలు చేసామని… విధ్వంసకారుల దాడుల్లో 15 మంది పోలీసులతో పాటు చాలామంది గాయపడ్డారని వివరించారు. కొన్ని ఆస్తులు కూడా ధ్వంసం చేశారు…ముత్యాలమ్మ టెంపుల్ లో జరిగిన ఘటనపై ఇప్పటికే రెండుసార్లు ప్రకటన చేశామన్నారు. దేవాలయంలో జరిగిన సంఘటన సంబంధించి ఇప్పటికే ఒకరిని అరెస్టు చేసామని… ఘటన జరిగినప్పుడు స్థానికులు చేసిన దాడిలో నిందితులు తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని.. కొంతమంది ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు ప్రచారాలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని ప్రజలకు సూచనలు చేశారు.

Related posts

లగచర్ల దాడి పథకం ప్రకారమే.. సాక్ష్యాలు వెలుగులోకి…

TV4-24X7 News

జూన్ రెండో వారంలో టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు?

TV4-24X7 News

బర్డ్‌ఫ్లూపై తెలంగాణ సర్కార్ అలర్ట్.. 3 చెక్ పోస్టులు, ఏపీ నుంచి వచ్చే కోళ్లు రిటర్న్!

TV4-24X7 News

Leave a Comment