కడపజిల్లా యర్రగుంట్లలో తాను బ్రతికుండగానే డెత్ సర్టిఫికెట్ సృష్టించి తన భూమిని ఆన్లైన్లో ఎక్కించుకున్నారని యర్రగుంట్లకు చెందిన భూమిరెడ్డి చిన్ననాగిరెడ్డి అనే వృద్ధుడు వాపోయాడు. యర్రగుంట్లలో ఆయన తన గోడును విలేకరులకు తెలుపుతూ.ముద్దనూరు మండలం చిన్న దుద్యాల గ్రామంలో తనకున్న 6 ఎకరాల భూమి నీ ముద్దునూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రైటర్ గా పనిచేస్తున్న బో రెడ్డి శివశంకర్ రెడ్డి తాను మరణించినట్లు తప్పుడు ధృవీకరణ పత్రాన్ని సృష్టించి తన పేరు మీద ఉన్న భూమిని ఆన్లైన్లో శివశంకర్ రెడ్డి తన పేరు మీదికి మార్చుకున్నాడని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. మండల తహసిల్దార్, పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ శివ శంకర్ రెడ్డి పై ఎటువంటి చర్యలు తీసుకోకుండా అధికారులు తిప్పుకుంటున్నారని ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని ఆయన కోరారు.

previous post