దక్షిణంలో రోడ్లు కు మహర్ధశ
విశాఖపట్నం గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా పాత నగరంలో అభివృద్ధి కుంటు పడిందని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు. 41 వ వార్డులోని సెబాస్టియన్ కాలనీ నుంచి బాబుకాలనీ వరకు రహదారి ని 20లక్షల తో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు . ఈ మేరకు 41 వ వార్డులో రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం లక్ష్యం అన్నారు. తాను అందరికి అందుబాటు లో ఉంటానని చెప్పారు. కార్యక్రమంలో జెడ్సీ బి.రాము, కార్పొరేటర్ పూర్ణిమ, టీడీపీ అధ్యక్షుడు ఐతి మధుబాబు, జనసేన అధ్యక్షుడు ఆంథోని శేఖర్ , భాజపా అధ్యక్షుడు వంక సంజీవరావు , కూటమి నాయకులు భానోజీరావు, ఐతి రవిబాబు, గవర రవణ, సన్నియాదవ్, సానబాని ఫ్రాన్సిస్, పిల్లి గోవిందరాజు, చిన్నబాబు, సునీత, ఆశా జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.అనంతరం 41 వార్డ్ అధ్యక్షులు ఆంథోనీ శేఖర్ ఆధ్వర్యంలో ఒంటరి మహిళకు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ చేతులమీదుగా నిత్యావసర వస్తువులు అందజేశారు.