విశాఖపట్నం అల్లిపురం నేరెళ్ల కోనేరు జంక్షన్ నుండి చావుల మధుం రోడ్డు వరకు రూ.20 లక్షల వ్యయంతో భూగర్భ నీటిపారుదల వ్యవస్థ పైపులైన్ల(యూజీడి) పనులను విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు,32వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూకాంట్రాక్టర్ చక్రవర్తి ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు ను చేపట్టడం జరుగుతుందని అన్నారు.32వ వార్డును మోడల్ వార్డు గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు.ఇందుకోసం తాను అహర్నిశలు కృషి చేస్తున్నానని చెప్పారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలో తాను సఫలమయ్యానని అన్నారు.అలాగే తన సొంత నిధులతో కూడా చాలా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.తను చేస్తున్న మంచి పనులకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందన్నారు.అలాగే స్థానిక ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ తమ వార్డు అభివృద్ధికి ఇతోధికంగా సహకరిస్తున్నారని చెప్పారు.ఆయన సేవలు మరువలేనివని అన్నారు. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.అదే విధంగా జనసేన,టిడిపి, బిజెపి కూటమి నాయకుల సహకారాంతో వార్డును మరింత అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు నారా నాగేశ్వరావు, మంత్రి శాలివాహన, కొట్టాల రమేష్,నీల బాబు,సిపిఐ బుజ్జి,కందుల రాజశేఖర్, మద్ది రాజశేఖర్ రెడ్డి,నాగేంద్ర , సూరి, పైడ్రాజు, కృష్ణ, బుజ్జి, ప్రసాద్, జానకి, శ్రీదేవి, దక్షిణ నియోజకవర్గం యువ నాయకులు, కందుల బద్రీనాథ్, కందుల కేదార్నాథ్ తదితరులు పాల్గొన్నారు.

previous post