నాగార్జునసాగర్ డ్యామ్్ప ఏపీ , టీజీ మధ్య ఎలాంటి వివాదం జరగలేదని ఏపీ ఇరిగేషన్ ఎస్సీ కృష్ణమోహన్ స్పష్టం చేశారు. అధికారుల మధ్య జల వివాదం జరిగిందన్న వార్తలపై ఆయన స్పందించారు. అధికారులు పరస్పర సమన్వయంతో గేట్ల నిర్వహణను పరిశీలిస్తున్నారని చెప్పారు. కుడి కాలువ రీడింగ్ విషయంలో కమ్యూనికేషన్ గ్యాప్తో ఇద్దరు ఉద్యోగుల మధ్య చిన్న వివాదం జరిగిందని, ఆ సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు.
