ఆంధ్రప్రదేశ్ : వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డిని పోలీసులు మంగళవారం ఉదయం 5 గంటలకు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం రవీందర్‌రెడ్డికి జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. విచారణ సందర్భంగా తనను పోలీసులు తీవ్రంగా కొట్టారని వర్రా పేర్కొన్నాడు. దీంతో ఉదయం 10 గంటలకు కడప రిమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించాలని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు. అనంతరం రవీందర్‌రెడ్డిని కడప జైలుకు తరలించారు.

previous post