Tv424x7
National

గస్తీ ఒప్పందం వేళ.. భేటీ కానున్న భారత్‌-చైనా రక్షణ మంత్రులు

భారత్‌-చైనా (India-China) రక్షణ మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, డోంగ్‌ జున్‌ (Rajnath Singh-Dong Jun) త్వరలో భేటీ కానున్నట్లు తెలుస్తోంది..సరిహద్దు, ప్రాంతీయ స్థిరత్వమే అజెండాగా వారి మధ్య చర్చలు జరగనున్నట్లు సమాచారం. ఆసియాన్ రక్షణమంత్రుల సమావేశాలకు అనుబంధంగా వచ్చేవారం వీరి భేటీ జరిగే అవకాశం ఉందని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి నాలుగేళ్లుగా కొనసాగిన ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ ఇరుదేశాలు కీలక గస్తీ ఒప్పందం (Border Truce) కుదుర్చుకున్నాయి. దీనిప్రకారం.. 2020 నాటి యథాస్థితి ఎల్‌ఏసీ వెంబడి ఇక కొనసాగుతుందని, ఇరుదేశాల సైనికులు 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్‌ పాయింట్లకు ఇక స్వేచ్ఛగా వెళ్లొచ్చని రెండు దేశాలు ఒప్పందంలో పేర్కొన్నాయి. దానిలోభాగంగా కీలక ప్రాంతాల నుంచి ఇరుదేశాల సైనికులు తమ మౌలిక సదుపాయాలను, ఇతర సామగ్రిని వెనక్కి తీసుకున్నట్లు ఆర్మీ వర్గాలు ఇటీవల వెల్లడించాయి..

Related posts

ప్లీజ్ నన్ను పాస్ చేయండి సర్ : లేదంటే పెళ్లి చేస్తారు’.

TV4-24X7 News

శ్రీలంక పర్యటన.. నేడే భారత జట్టు ప్రకటన!

TV4-24X7 News

వైద్య రంగంలో కీలక ముందడుగు.. అతి తక్కువ ఖర్చుతో ఐఐటీ మద్రాస్ సరికొత్త ఆవిష్కరణ

TV4-24X7 News

Leave a Comment