విశాఖపట్నం శ్రీ సింహాచలం సింహాద్రి అప్పన్నను సోమవారం ఉదయం మాజీ ఎమ్మెల్యే, వాసుపల్లి గణేష్ కుమార్ కుటుంబంతో సహా దర్శించుకున్నారు. వాసుపల్లి మాతృమూర్తి అమ్మాజీ, సతీమణి ఉషారాణి, పెద్ద కుమారుడు సూర్య, సౌందర్యరాశి దంపతులు, చిన్న కుమారుడు సాకేత్ స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం కప్పస్తంభం ఆలింగనం చేసుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, శ్రీ సింహాచల పుణ్యక్షేత్రం దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను అన్నారు. ద్వయవతార రూపంలో దర్శనమిచ్చే నృసింహస్వామి ఆయన చల్లని చూపులతో విశాఖను కాపాడాలని వేడుకున్నారు. దక్షిణ నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వారి కుటుంబానికి చందన స్వామి ఆశీస్సులు ఉండాలని వాసుపల్లి గణేష్ కుమార్ ఆకాంక్షించారు.
