Tv424x7
Andhrapradesh

ఆర్టీసీ బస్సులో ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

రేణిగుంట: ఆర్టీసీ బస్సులో ఉరేసుకుని ఓ యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. బస్సు ఏర్పేడు సమీపంలోకి వచ్చినప్పుడు ఈ ఘటన జరిగినట్లు సమాచారం..రేణిగుంట వద్ద కండక్టర్‌ దీన్ని గుర్తించారు. బస్సులో చివరి సీటు వద్ద ఉన్న హ్యాంగర్‌కు ఉరేసుకుని చనిపోయినట్లు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో బస్సులో ముగ్గురు ప్రయాణికులు ఉన్నారు. రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతిచెందిన యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది..

Related posts

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.

TV4-24X7 News

దళిత విద్యార్థి జేమ్స్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

TV4-24X7 News

జగన్ ను హీరో అంటున్న ABN వేమూరి రాధాకృష్ణ

TV4-24X7 News

Leave a Comment