Tv424x7
National

కంప్లైంట్ ఇచ్చేందుకు వచ్చిన మహిళపై పోలీస్ వేధింపులు – వీడియో వైరల్ కావడంతో అరెస్ట్

కర్నాటకకు చెందిన రామచంద్రప్ప అనే సీనియర్ పోలీసు ఒక మహిళను వేధిస్తున్నట్లు కనిపించే వీడియో వైరల్ కావడంతో అతన్ని అరెస్టు చేసి సస్పెండ్ చేశారు.*దేశంలో మహిళలపై వేధింపులు, హత్యలు, అఘాయిత్యాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక చోట మహిళలు అనేక సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యలు తీర్చాల్సిన వాళ్లే కొన్ని చోట్ల సమస్యలను తెచ్చిపెడుతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా మితిమీరి ప్రవర్తిస్తున్నారు. న్యాయం జరుగుతుందేమోనని రోడ్డున పడుతున్న వాళ్లు కొందరైతే.. పరువు పోతుందని జరిగిన నష్టాన్ని, బాధను తమలోనే దాచుకుని కుమిలి పోతున్న జీవితాలెన్నో. తాజాగా కర్ణాటకలోనూ ఓ ఉదంతం చోటుచేసుకుంది. భూవివాదంపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఓ మహిళపై అధికారంలో ఉన్న ఓ పోలీసు అధికారి అనుచితంగా ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో.. అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఆ పోలీస్ అధికారిని సస్పెండ్ చేసి, అరెస్ట్ చేశారు.అసలేమైందంటే..కర్ణాటకలోని మధుగిరి ((తుమకూరు జిల్లా)లోని ఓ మహిళ భూవివాదంపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు చేరుకుంది. ఆ సమయంలో అక్కడే ఉన్న డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రామచంద్రప్ప ఆ మహిళకు న్యాయం చేసేందుకు సాయం చేస్తారని మాయా మాటలు చెప్పి, నమ్మించి తన మగ బుద్దిని చాటుకున్నాడు. ఇదే అదనుగా చేసుకుని ఓ గదిలోకి తీసుకెళ్లి ఆ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన జనవరి 2న జరిగినట్టు తెలుస్తోంది.

Related posts

వరుస రైలు ప్రమాదాలు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం

TV4-24X7 News

మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి గిన్నిస్ రికార్డు.. ఎందుకంటే?

TV4-24X7 News

మైనర్ బాలిక హత్య కేసులో ట్విస్ట్

TV4-24X7 News

Leave a Comment