Tv424x7
Andhrapradesh

రివాల్వర్ తో ఆత్మహత్య చేసుకున్న తణుకు ఎస్సై కుటుంబానికి …రూ.45.68 లక్షల సాయం చేసిన అతని స్నేహితులు

తణుకు ఎస్సై కుటుంబానికి స్నేహితుల అండసత్యనారాయణమూర్తి బ్యాచ్‌ పోలీసులు కలిసి రూ.రూ.45.68 లక్షల ఆర్థిక సాయం అందజేతపశ్చిమగోదావరి జిల్లా తణుకు పోలీస్ స్టేషన్‌లో ఆత్మహత్య చేసుకున్న ఎస్సై ఆదుర్తి గంగ సత్యనారాయణమూర్తి కుటుంబానికి తోటి మిత్రులు అండగా నిలిచారు.డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కె.గంగవరానికి చెందిన సత్యనారాయణమూర్తి ఇంటికి వెళ్లి సాయాన్ని అందజేశారు. సత్యనారాయణమూర్తికి భార్య విజయలక్ష్మి, హేమాన్షి, చందన అనే ఇద్దరు కూతుర్లతో పాటుగా వృద్ధులైన తల్లిదండ్రులూ ఉన్నారు. దీంతో ఆయన కుటుంబానికి సత్యనారాయణమూర్తి బ్యాచ్‌ పోలీసులంతా కలిసి రూ.రూ.45.68 లక్షల ఆర్థిక సాయం అందజేశారు.

Related posts

రోడ్డు ప్రమాద బాధితుడికి పది వేలు సాయం

TV4-24X7 News

సూసైడ్ కు ప్రయత్నించిన మహిళను కాపాడిన పోలీసులు

TV4-24X7 News

పోలింగ్ నిర్వహణకు సన్నద్ధం: ముఖేశ్​ కుమార్​ మీనా

TV4-24X7 News

Leave a Comment