Tv424x7
Telangana

జూన్ 2 కవిత కొత్త పార్టీ ? రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేస్తుందని జరుగుతున్న ప్రచారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. జూన్ 2న కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేస్తుందని వ్యాఖ్యానించారు. పార్టీ ప్రకటన అనంతరం షర్మిల తరహాలోనే కవిత తెలంగాణలో పాదయాత్ర చేస్తుందని తెలిపారు.అదే సమయంలో కవిత రాజకీయంగా వేస్తున్న అడుగులపై సందేహం వ్యక్తం చేశారు రఘునందన్ రావు. కేసీఆర్ దేవుడు, ఆయన పక్కన దెయ్యాలు ఉన్నాయని కవిత చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ..దేవుడు, దెయ్యాల పక్కన పన్నెండు ఏళ్లుగా ఏం చేస్తున్నారని నిలదీశారు.బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని భయంతోనే నాటకం స్టార్ట్ చేశారని ఆరోపించారు రఘునందన్ రావు. ఒకరితో గొడవ అయితే మరొకరు దగ్గరికు వెళ్లేలా గ్రూపులు క్రియేట్ చేసుకుంటున్నారన్నారు. మాట్లాడుకోవాలనుకుంటే తండ్రి, కూతురు మధ్య మధ్యవర్తి ఎందుకు వస్తారు అని ప్రశ్నించారు.

Related posts

ఈ నెలాఖరున తెలంగాణ రాష్ట్రానికి అమిత్

TV4-24X7 News

నేడు సీఎం రేవంత్‌ మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర

TV4-24X7 News

తెలంగాణలో కాంగ్రెస్ పాలనపై 11 నెలల్లోనే ప్రజల నుంచి వ్యతిరేకత: కిషన్ రెడ్డి

TV4-24X7 News

Leave a Comment