Tv424x7
Andhrapradesh

జగన్‌దే ఆలస్యం.. నారా లోకేష్‌తో రాజీనామా చేయించే చాన్స్ !

వైఎస్ జగన్ కు నారా లోకేష్‌తో రాజీనామా చేయించే చాన్స్ వచ్చింది. దానికి పెద్దగా కష్టపడాల్సిన పని కూడా లేదు. కేవలం తాను ప్రభుత్వంపై చేస్తున్న ఓ ఆరోపణకు సంబంధించి చిన్న ఆధారం బయట పెట్టడమే. అలా చేస్తే తాను రాజీనామా చేస్తానని నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా సవాల్ చేశారు. ఇప్పుడు జగన్ కు తాను చెప్పింది అబద్దం కాదని.. తాను ఫేక్ చేయడం లేదని నిరూపించుకోవడానికైనా స్పందించి.. ఆధారాలు సమర్పించాల్సి ఉంది. లేకపోతే జగన్ రెడ్డి ఫేక్ పాలిటిక్స్ మరోసారి ఎక్స్ పోజ్ అవుతుంది.నారా లోకేష్ చేసిన ఈ సవాల్ ఉర్సా క్లస్టర్ కంపెనీ గురించి. జగన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడినా ఈ కంపెనీ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ఇడ్లీలు కూడా రూపాయికి రావడం లేదని కానీ ఎకరాలు ఇచ్చారని ఆరోపిస్తున్నారు. దీంతో మహానాడు వేదికగా కూడా నారా లోకేష్ సవాల్ చేశారు. ఇప్పుడు మరోసారి అదే మాట్లాడటంతో అదే సవాల్ సోషల్ మీడియాలో చేశారు. ఒక వేళ ఆధారాలు చూపించకపోతే జగన్ రాజకీయాల నుంచి వైదొలగాల్సిన పని లేదని.. క్షమాపణ చెబితే చాలంటున్నారు.ఉర్సా కంపెనీకి 99పైసలకు భూములు ఇవ్వలేదు. టీసీఎస్ కు ఇచ్చారు. కానీ ఈ కంపెనీకి ఇచ్చారని ప్రజల్లో తప్పుడు ప్రచారాన్ని జగన్ చేస్తున్నారు. ఎకరా కోటి రూపాయలు చొప్పున 3.5 ఎకరాలు.. ఎకరా 50 లక్షల రూపాయలు చొప్పున 56.5 ఎకరాల భూమిని కేటాయింంచారు. జీవోల్లో , ఆదేశాల్లో అదే స్పష్టంగా ఉంది. కానీ జగన్ రెడ్డి మాత్రం ఏ మాత్రం సిగ్గుపడకుండా తన ఫేక్ రాజకీయం కొనసాగించేస్తున్నారు.

Related posts

నాగార్జున సాగర్ నుంచి ఏపీకి 12 టీఎంసీలు

TV4-24X7 News

నిరాశ్రయుల వసతి గృహంలో దీపావళి సంబరాలు

TV4-24X7 News

మంగళ, శనివారాల్లో సాగర్ – శ్రీశైలం లాంచీలు

TV4-24X7 News

Leave a Comment