కడప/ ప్రొద్దుటూరు పట్టణంలో ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా పోయింది అని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయప నివాసం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భూములు, స్థలాలు, ఇండ్లు కొనేముందు ఒకటికి పదిసార్లు పరిశీలన చేసి కొనుగోలు చేసుకోవాలని కోరారు. ఇటీవల కాలంలో మోసపూరితమైన నకిలీ అగ్రిమెంట్ పత్రాలు, డాక్యుమెంట్ లు సృష్టించిన ఘనులు ప్రొద్దుటూరు లో ఉండటం దురదృష్టకరమన్నారు. వీరికి అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉండటంతో వారి ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందన్నారు. ఏకంగా మండలాధ్యక్షుడు శేఖర్ యాదవ్ కు చెందిన స్థలం పత్రాలు కూడా నకిలీ సృష్టించిన ఘనులు నుండి ప్రజలు అప్రమత్తం కావాలని కోరారు. ప్రొద్దుటూరు మున్సిపల్ 19 వ వార్డు కౌన్సిలర్ మునీర్ ఇందుకు సూత్రధారి అని ఆరోపించారు. అగ్రిమెంట్, రిజిస్ట్రేషన్, లింకు డాక్యుమెంట్లు అన్నీ కూడా నకిలీ పత్రాలు సృష్టించి పలు అమ్మకాలు సాగించారని వివరించారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు శేఖర్ యాదవ్, కౌన్సిలర్ లు వరికూటి ఓబుళరెడ్డి, సత్యం, గరిశపాటి లక్ష్మి దేవి, తదితరులు పాల్గొన్నారు.

previous post
next post