Tv424x7
Andhrapradesh

పండ్లలో కెమికల్స్ కలకలం…. తింటే ఇక అంతే…

విజయవాడ:

మార్కెట్‌లోకి వస్తున్న అరటిపండ్లు సహజంగా కాకుండా రసాయనాలతోనే పండుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పచ్చి అరటికాయలు ఒక్క రాత్రిలోనే బాగా పండినట్లుగా మారిపోతుండటంపై వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది.

వ్యాపారులు లాభాల కోసం క్యాల్షియం కార్బైడ్ వంటి రసాయనాలను వాడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.వైద్య నిపుణులు హెచ్చరిస్తూ… ఈ కెమికల్స్‌లో ఆర్సెనిక్, ఫాస్ఫరస్ హైడ్రైడ్ ఉండటం వల్ల శ్వాసకోశ సమస్యలు, కడుపునొప్పులు, లివర్‌, కిడ్నీలకు హానీ కలుగుతుందని చెబుతున్నారు.

దీర్ఘకాలికంగా తీసుకుంటే క్యాన్సర్ ముప్పు కూడా పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు.

వినియోగదారులు పండ్లు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్త వహించాలని, సహజంగా పండినవి మాత్రమే వినియోగించాలని వైద్యులు సూచిస్తున్నారు.

Related posts

ఇది చాలా హృదయాన్ని హత్తుకునే వార్త…

TV4-24X7 News

గోవధ జరగకుండా చూడాలని హైకోర్టు ఆదేశాలు..

TV4-24X7 News

కల్లూరు గ్రామంలో ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు

TV4-24X7 News

Leave a Comment