Tv424x7
Crime News

దారుణ ప్రేమకథ: లవర్‌ను కాల్చి యువకుడు ఆత్మహత్య..

చందౌలీ, యూపీ లో అమానుష ఘటన చందౌలీ జిల్లాలో చోటు చేసుకుంది. పెళ్లి ఫిక్స్ అయిందని ఒక యువకుడు తన ప్రియురాలిని కాల్చి, ఆ తర్వాత తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

మహమ్మద్‌పూర్ న్యూ కాలనీ నివాసి, 25 ఏళ్ల పండ్ల వ్యాపారి సంజయ్, 22 ఏళ్ల సబియా బానోతో కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నాడు. అయితే సబియా కుటుంబం ఆమెను మరొకరితో వివాహం చేసేందుకు నిర్ణయించడంతో, రామ్ నగర్‌లోని సబియా ఇంటికి సంజయ్ వెళ్లి ఆమెపై పిస్టల్‌తో కాల్పులు జరిపాడు. ఆ తర్వాత తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ప్రస్తుతం సబియా పరిస్థితి తీవ్రంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Related posts

నకిలీ సిగరెట్లు స్వాధీనం

TV4-24X7 News

రేణిగుంటలో 17 ఏళ్ల బాలుడి దారుణ హత్య..

TV4-24X7 News

ఇద్దరితో వివాహేతర సంబంధం.. పెట్టుకున్న … మహిళ దారుణ హత్య

TV4-24X7 News

Leave a Comment