Tv424x7
Andhrapradesh

ప్రొద్దుటూరు మైదుకూరు రోడ్డు గుంతల మయం – ప్రజల ఆగ్రహం

కడప, ప్రొద్దుటూరు:

ప్రొద్దుటూరు పట్టణంలోని ప్రధాన రహదారి అయిన మైదుకూరు రోడ్ గుంతలతో నిండిపోయి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ఈ రహదారిలో ప్రతిరోజూ వేలాది వాహనాలు రాకపోకలు చేస్తున్నప్పటికీ, రోడ్డుపై గుంతలు, నీటి నిల్వల కారణంగా వాహనాలు నష్టపోతున్నాయి.

వర్షకాలంలో పరిస్థితి మరింత తీవ్రమవుతుంది, గుంతలు కనిపించక ప్రమాదాలు ఎక్కువయ్యే అవకాశం ఉంది.

స్థానికులు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి నంద్యాల దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. “అభివృద్ధి పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లు చెప్పడం సరిపోదు, నిజమైన మార్పులు అవసరం,” అని స్థానికులు అన్నారు.

ప్రజలు తక్షణంగా మారమ్మత్తులు చేపట్టి, రోడ్డు ప్రమాదాలను నివారించడానికి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వం కోరుతున్నారు.

Related posts

ఫేక్ వీడియోల ద్వారా ప్రభుత్వంపై దృష్ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం

TV4-24X7 News

ఓటర్ల జాబితా పంచాయితీకి పుల్‌స్టాప్.. డెడ్‌లైన్ చెప్పేసిన ఎన్నికల కమిషన్.!

TV4-24X7 News

ప్రభుత్వ సిమెంట్ రోడ్డు కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి: అడ్వకేట్ నానుబాల శ్రీనివాసులు

TV4-24X7 News

Leave a Comment