Tv424x7
National

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు..2669కి చేరిన పాజిటివ్ కేసులు

ఢిల్లీ..దేశంలో కరోనా వైరస్ జేఎన్.1 వేరియంట్ విజృంభిస్తున్నది. గత 24 గంటల్లో కొత్తగా 358 మంది కరోనా బారినపడ్డారు. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,669కి చేరింది..ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4,44,70,576 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 5,33,327 మంది మరణించారు. కొవిడ్ జేఎన్.1 వేరియంట్కు చెందిన కొత్త కేసులు ప్రధానంగా కేరళ, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్రలో నమోదయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో కరోనా కారణంగా కేరళలో ముగ్గురు మరణించాగా, కొత్త కేసుల్లో 300 రాష్ట్రంలోనే ఉండటం గమనార్హం. కాగా, మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.01 శాతం మాత్రమేనని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదేవిధంగా రికవరీ రేటు 98.81 శాతం, మరణాలు 1.18 శాతంగా ఉన్నాయని తెలిపింది..

Related posts

విమానాల్లో పవర్ బ్యాంకులపై నిషేధం!

TV4-24X7 News

ఈ మూడు నెలలూ మండే ఎండలు

TV4-24X7 News

రైల్వే టికెట్ల నుంచి యూపీఐ వరకు.. అక్టోబర్‌ 1 నుంచి మారనున్న కీలక మార్పులు!

TV4-24X7 News

Leave a Comment