Tv424x7
Andhrapradesh

ప్రతి సమస్యకు పరిష్కారమే లక్ష్యం : టీడీపీ ఇంచార్జ్ బి.టెక్ రవి

కడప:పులివెందుల టీడీపీ కార్యాలయంలో ఈ రోజు ప్రజా దర్బార్‌ను నిర్వహించిన టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ బి.టెక్ రవి, ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా విని పరిష్కార దిశగా చర్యలు చేపట్టారు. వచ్చిన ప్రతి విన్నపంపై సంబంధిత అధికారులకు వెంటనే సూచనలు ఇచ్చి, తక్షణ పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.అవసరం అనిపిస్తే ప్రజల సమస్యలను నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామని బి.టెక్ రవి తెలిపారు.ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని అత్యున్నత ప్రాధాన్యంగా భావిస్తుందని, అదే దిశగా ప్రతి ప్రాంతంలో ప్రజల సమస్యలను పరిష్కరించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Related posts

ఆధార్ అప్డేట్ చేసుకున్నారా? చివరి గడువు ఎప్పుడో తెలుసా..?

TV4-24X7 News

కడపలో సందడి చేసిన హీరోయిన్

TV4-24X7 News

35 వ వార్డ్ లో నూతన వీధి దీపాలు

TV4-24X7 News

Leave a Comment