కడప / మైదుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ ప్రొద్దుటూరు క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, 84 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.71,20,390 విలువైన చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, ఆపదలో ఉన్న పేద మరియు అవసరమైన కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూత అందించడం రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు.అలాగే ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
previous post

