Tv424x7
National

మధురైలో జల్లికట్టు స్టేడియం ప్రారంభించిన సీఎం స్టాలిన్

Jallikattu Stadium:తమిళనాడు మధురై జిల్ల అలంగనల్లూరు సమీపంలోని కీలకరైలో నూతనంగా నిర్మించిన జల్లికట్టు స్టేడియాన్ని సీఎం స్టాలిన్ ప్రారంభించారు.జల్లికట్టు కోసం దేశ చరిత్రలో తొలిసారిగా ప్రత్యేకంగా ప్రభుత్వం నిర్మించిన స్టేడియం ఇదే కావడం గమనార్హం. స్టేడియంలో తొలిసారిగా ఆరువందల ఎద్దులు పోటీలకు సిద్ధమయ్యాయి. నాలుగు వందలమంది యువకులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. కొత్త జల్లికట్టు స్టేడియానికి మాజీ ముఖ్యమంత్రి, దివంగత డీఎంకే నేత ఎం.కరుణానిధి పేరు పెట్టారు. ఈ గ్రామంలో రూ.44 కోట్ల అంచనా వ్యయంతో 5 వేల మందికి పైగా సీటింగ్ కెపాసిటీతో ప్రపంచస్థాయి జల్లికట్టు స్టేడియాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గతంలో ప్రకటించారు..ఈ స్టేడియంలో ఆటగాళ్లు, ప్రేక్షకులు, మీడియాకు అవసరమైన సౌకర్యాలతో పాటు త్వరిత ప్రథమ చికిత్స, నిరంతర వైద్య సహాయాన్ని అందించేలా ఏర్పాట్లు చేశారు. వీఐపీ సీటింగ్, మ్యూజియం, బుల్ షెడ్, వెటర్నరీ డిస్పెన్సరీ, ఆరోగ్య సహాయక కేంద్రాలు ఈ స్టేడియంలో ఉన్నాయి..

Related posts

సోషల్ మీడియా వేదికలకు కేంద్రం వార్నింగ్

TV4-24X7 News

కోల్‌కతా లా విద్యార్థినిపై సామూహిక లైంగికదాడి కేసు.. కీలక సీసీటీవీ ఫుటేజీ వెలుగులోకి

TV4-24X7 News

కేదారినాథ్ వెళ్తూ కుప్పకూలిన హెలికాప్టర్.. ఆరుగురి గల్లంతు

TV4-24X7 News

Leave a Comment