ఎండిన వరి పొలాలను పరిశీలించిన వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు

ఏలూరు జిల్లా, జూలై 22: ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం దేవపూడి గ్రామంలో నీటి కొరతతో ఎండిపోతున్న వరి పొలాలను వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు రైతులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకుని ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు.

 

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కైకలూరు నియోజకవర్గంలో సాగునీరు అందక వరి పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టిసీమ నుంచి నీరు వదులుతున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ఆ నీరు రైతుల పొలాలకు చేరడం లేదని ఆరోపించారు.

 

రైతుల గోడు, వారి బాధలు ప్రభుత్వానికి పట్టడం లేదని, రాష్ట్రం, కేంద్ర రాజకీయాలపైనే అధికార పార్టీ నాయకుల దృష్టి ఉందని విమర్శించారు. పక్క నియోజకవర్గాలకు నీరు తరలిపోతున్నా స్థానిక ఎమ్మెల్యే స్పందించడం లేదని అన్నారు.

 

ఈ కాలంలో సాధారణంగా భారీ వర్షాలతో ప్రాంతం జలమయం కావాల్సి ఉండగా, ప్రస్తుతం వర్షాభావం కారణంగా పొలాలు ఎండిపోయాయని తెలిపారు. బ్యారేజీల్లో ఉన్న నీటిని వెంటనే సాగుకు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 

ఎండిన పొలాలకు తక్షణమే సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని, రైతుల పట్ల ప్రభుత్వం తన బాధ్యతను నిర్వర్తించాలని దూలం నాగేశ్వరరావు కోరారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *