భర్తను నెలవారీగా ‘లీజుకు’ ఇచ్చిన భార్య..!
అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తకు ఊహించని షాక్
ఇల్లు అద్దెకు ఇవ్వడం, కార్లు–బైకులు లీజుకు ఇవ్వడం గురించి విన్నాం. కానీ భర్తను నెలవారీగా ‘లీజుకు’ ఇవ్వాలని భార్య ప్రతిపాదించడం అరుదైన ఘటన. థాయ్‌లాండ్‌లో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.థాయ్‌లాండ్‌కు చెందిన 31 ఏళ్ల ఖున్ క్వాంగ్ అనే మహిళ పదేళ్ల క్రితం ఓ పోలీసు అధికారిని ప్రేమించి వివాహం చేసుకుంది. వీరికి ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు. కొంతకాలంగా భర్త ప్రవర్తనలో మార్పు రావడంతో అనుమానం వచ్చిన ఆమె, ప్రైవేట్ డిటెక్టివ్‌ను నియమించింది. విచారణలో భర్త మరో మహిళతో సంబంధం పెట్టుకుని, ఆమెతో కలిసి నివసిస్తున్నట్లు ఆధారాలతో బయటపడింది.
విషయం తెలిసిన తర్వాత భర్త ఇంటికి వచ్చి, “నాకు ఈ సంసారం వద్దు.. నేను ఆమెతోనే ఉంటాను” అంటూ వెళ్లిపోయాడు. అయితే భార్య అతడిని తిరిగి ఇంటికి రప్పించింది.ఆ తర్వాత భర్త తన ప్రియురాలిని మర్చిపోలేనని చెప్పడంతో, భార్య వినూత్నమైన ప్రతిపాదన చేసింది. “నెలకు 30,000 థాయ్ బాట్లు (సుమారు రూ.85,000) చెల్లిస్తే నా భర్త నీతోనే ఉండొచ్చు. కానీ నేను చట్టపరంగా విడాకులు ఇవ్వను” అని ప్రియురాలికి షరతు పెట్టింది.
ఈ ప్రతిపాదనకు ప్రియురాలు అంగీకరించినప్పటికీ, తనను ఇలా ‘లీజుకు’ ఇవ్వడాన్ని భర్త తిరస్కరించాడు.
ఈ ఘటన వైరల్ కావడంతో న్యాయ నిపుణులు స్పందించారు. థాయ్‌లాండ్ చట్టాల ప్రకారం డబ్బు తీసుకుని జీవిత భాగస్వామిని మరొకరికి ‘లీజుకు’ ఇవ్వడం వంటి ఒప్పందాలకు ఎలాంటి చట్టబద్ధత లేదని స్పష్టం చేశారు. చివరికి ఈ ‘హజ్బెండ్ లీజ్’ ప్రణాళిక అమలు కాకపోవడంతో, భార్య తన భర్త ప్రియురాలిపై కోర్టులో కేసు దాఖలు చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.