ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూత

ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూత

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తెలుగు, హిందీ, తమిళ చిత్రాల్లో విలక్షణ ప్రతినాయకుడిగా గుర్తింపు పొందిన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ (74) మంగళవారం కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో చికిత్స పొందుతున్న ఆయన ముంబై సమీపంలోని ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ప్రదీప్ రావత్ తెలుగు ప్రేక్షకులకు సై, ఛత్రపతి, లక్ష్మి చిత్రాల్లో ప్రతినాయకుడి పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. హిందీలో గజినీ, లగాన్ వంటి చిత్రాల్లోనూ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాగే మహాభారత్ టెలివిజన్ ధారావాహికలో అశ్వత్థామ పాత్రను పోషించి విశేష ఆదరణ పొందారు.

ఆయన మృతితో భారతీయ సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *