ప్రొద్దుటూరు: కడప జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులు కమలాపురం పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు.
ఈ సందర్భంగా వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో శ్రీనివాసులకు ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు. సీఐ కొండారెడ్డి, ఎస్సై మధుసూదన్ రెడ్డితో పాటు పోలీస్ సిబ్బంది ఆయనను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా శ్రీనివాసులు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో అందించిన సేవలను సీఐ కొండారెడ్డి, సిబ్బంది కొనియాడారు. అనంతరం ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వీడ్కోలు పలికారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: