భూమాయపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పారిశుద్ధ్య కార్మికుడు దుర్మరణం

 

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

కడప జిల్లా – మైదుకూరు: మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని భూమాయపల్లి వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొన్న ఘటనలో మైదుకూరు మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న పసల వెంకటయ్య (50) దుర్మరణం చెందారు.వెంకటయ్య తన స్వగ్రామమైన పప్పనపల్లె నుంచి మైదుకూరులో విధులకు వస్తుండగా, సుమారు తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదం తీవ్రతకు మృతదేహం గుర్తుపట్టలేని విధంగా చిద్రమైంది.సమాచారం అందుకున్న మైదుకూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ప్రమాదానికి కారణమైన గుర్తుతెలియని వాహనం కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *