దారుణం: ప్రియుడితో కలిసి భర్త, కొడుకును హత్య చేసిన మహిళ
బెంగళూరులో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం కారణంగా ఓ మహిళ తన భర్త, ఐదేళ్ల కుమారుడిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.బెంగళూరుకు చెందిన అభినందన్, హరిణి దంపతులకు ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో హరిణికి వినయ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడినట్లు పోలీసులు గుర్తించారు.ఈ విషయం తెలుసుకున్న భర్త అభినందన్ ఆమెను నిలదీయడంతో.. హరిణి తన ప్రియుడు వినయ్‌ను ఇంటికి పిలిచినట్లు తెలుస్తోంది. అనంతరం ఇద్దరూ కలిసి అభినందన్ గొంతు నులిమి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.అలికిడి విని నిద్రలేచిన ఐదేళ్ల బాలుడిని కూడా నిందితులు హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు హరిణి, వినయ్‌ను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: