ఫుడ్ కమిషన్ ఛైర్మన్ పర్యటనతో అధికారుల్లో ఉత్కంఠ

రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి రెండు రోజుల పాటు పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలలు, రేషన్ డిపోలు, హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నట్లు సమాచారం.ఛైర్మన్ పర్యటన నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బందిలో ఉత్కంఠ నెలకొంది. తనిఖీలకు సంబంధించిన సమాచారం ముందుగానే అందడంతో రికార్డుల నిర్వహణ, ఆహార నాణ్యత, వసతులు, పారిశుధ్యం తదితర అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తనిఖీల్లో ఎలాంటి లోపాలు బయటపడతాయోనన్న ఆందోళన అధికారుల్లో కనిపిస్తోంది.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *