విమర్శనాత్మక వార్తలపై జర్నలిస్టులపై క్రిమినల్‌ కేసులు సరికాదు: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: ప్రభుత్వాన్ని విమర్శిస్తూ జర్నలిస్టులు వార్తలు, కథనాలు రాశారనే కారణంతో వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయడం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రజాస్వామ్యంలో అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛను గౌరవించాలని పేర్కొంది.రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19(1)(ఏ) కింద జర్నలిస్టుల భావప్రకటన హక్కులు రక్షించబడతాయని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఒక జర్నలిస్టు రాసిన కథనం ప్రభుత్వంపై విమర్శగా ఉందనే కారణంతోనే క్రిమినల్‌ కేసు నమోదు చేయడం సమర్థనీయం కాదని వ్యాఖ్యానించింది.ఉత్తరప్రదేశ్‌కు చెందిన జర్నలిస్టు అభిషేక్‌ ఉపాధ్యాయ్‌ తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వంలోని అధికారుల నియామకాల్లో కుల సమీకరణాలపై ఆయన రాసిన కథనం నేపథ్యంలో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.ఈ పిటిషన్‌ను జస్టిస్‌ హృషికేష్‌ రాయ్‌, జస్టిస్‌ ఎస్‌.వీ.ఎన్‌. భట్టి ధర్మాసనం విచారించింది. పిటిషనర్‌కు మధ్యంతర రక్షణ కల్పించిన ధర్మాసనం.. సంబంధిత కథనానికి సంబంధించి ఆయనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *