చింతకుంటలో ఘనంగా అంగన్వాడీ ఉత్సవాలు

🟠 చింతకుంటలో ఘనంగా అంగన్వాడీ ఉత్సవాలు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

సి.బయనపల్లి అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ ఉత్సవాలు.. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారంపై అవగాహన
ఆరోగ్య పరీక్షలు, శ్రీమంతం, పోషకాహార ప్రదర్శనలు.. అంగన్వాడీ సిబ్బందికి సన్మానం

దువ్వూరు: చింతకుంట పంచాయతీ పరిధిలోని గుడిపాడు సెక్టార్ సి.బయనపల్లి అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ ఉత్సవాలు, పోషణ్ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. గుడిపాడు సెక్టార్ ఐసీడీఎస్ సూపర్వైజర్ సౌజన్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, తల్లిదండ్రులు, అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సూపర్వైజర్ సౌజన్య మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారాన్ని గర్భిణులు, బాలింతలు, చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చిన్నారుల ఆరోగ్యం, ఎదుగుదలలో పోషకాహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో భాగంగా మహిళలు, చిన్నారులకు ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అర్హులైన వారికి ప్రధానమంత్రి మాతృ వందన యోజనపై అవగాహన కల్పించారు. గర్భిణులకు శ్రీమంతం కార్యక్రమం నిర్వహించడంతో పాటు పౌష్టికాహార పదార్థాల తయారీ, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.

చిన్నారులు కోలాటాలతో సందడి చేయగా.. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలను సన్మానించి వారి సేవలను అభినందించారు.

కార్యక్రమానికి స్థానిక బీజేపీ నాయకులు కూడా హాజరై పోషకాహారం, మహిళలు మరియు చిన్నారుల ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆరవేటి హరికృష్ణ, దువ్వూరు మండల మైనారిటీ అధ్యక్షులు షేక్ మహమ్మద్ భాష, గుడిపాడు నాయకులు వై. బ్రహ్మానంద రెడ్డి, ఇతర స్థానిక నాయకులు పాల్గొన్నారు.

అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా వర్కర్లు, తల్లిదండ్రులు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *