ప్రొద్దుటూరులో సీఎం పర్యటన.. బందోబస్తు ఏర్పాట్ల పరిశీలన

ప్రొద్దుటూరులో సీఎం పర్యటన.. బందోబస్తు ఏర్పాట్ల పరిశీలన

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ప్రొద్దుటూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్టోబర్ 5న ప్రొద్దుటూరులో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు భద్రతా, ట్రాఫిక్, పార్కింగ్ ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఐఏఎస్, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఐపీఎస్ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.

ప్రొద్దుటూరు–జమ్మలమడుగు బైపాస్ రోడ్డులో ఉన్న మున్సిపల్ ప్లాట్లను కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఈ ప్రాంతాన్ని వాహనాల పార్కింగ్ కోసం వినియోగించే అంశంపై సంబంధిత అధికారులతో చర్చించారు. పార్కింగ్‌కు అవసరమైన ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

జాయింట్ కలెక్టర్ నిధి మీనా కూడా కలెక్టర్, ఎస్పీతో కలిసి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన సమయంలో ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు.

పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను వివిధ శాఖల అధికారులు సమన్వయంతో చేపట్టాలని కలెక్టర్, ఎస్పీ సూచించారు. బందోబస్తు, ట్రాఫిక్, పార్కింగ్ తదితర అంశాల్లో శాఖల మధ్య సమన్వయం ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ముఖ్యమంత్రి పర్యటనను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రతాపరమైన అన్ని ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *