న్యూఢిల్లీ: దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక అడుగు వేసినట్లు సమాచారం. తొలిదశలో రూ.10, రూ.20 విలువైన ప్లాస్టిక్ నోట్లపై ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహించేందుకు ప్రయోగాత్మక ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
ఈ నోట్ల తయారీకి అవసరమైన ప్రత్యేక మెటీరియల్ సరఫరా కోసం అర్హత కలిగిన కంపెనీల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానించే ప్రక్రియను RBI అనుబంధ సంస్థ భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ (BRBNMPL) చేపట్టినట్లు సమాచారం.
ప్రస్తుతం వినియోగంలో ఉన్న కాగితపు నోట్లతో పోలిస్తే ప్లాస్టిక్ నోట్లు ఎక్కువ కాలం మన్నికగా ఉండే అవకాశం ఉంది. దీంతో నోట్ల జీవితకాలం పెరగడంతో పాటు, తరచుగా దెబ్బతినే చిన్న విలువ గల నోట్ల సమస్యను తగ్గించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇప్పటికే 2012లోనూ ప్లాస్టిక్ నోట్లపై ప్రయోగాత్మకంగా ప్రయత్నాలు జరిగాయి. అయితే అప్పట్లో ఎదురైన సాంకేతిక సమస్యల కారణంగా ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ప్రతిపాదనను మరోసారి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
Save or share this story as a newspaper-style Epaper Clip: