Tv424x7
National

ప్రముఖ క్యాబ్‌ సేవల సంస్థ ఊబర్‌ త్వరలో బస్సు సేవలను ప్రారంభించనుంది

న్యూ ఢిల్లీ:దేశ రాజధాని నగరం దిల్లీలో తొలుత ఈ సేవలను ప్రారంభించనుంది. దిల్లీ ప్రీమియం బస్‌ స్కీమ్‌ కింద ఇకపై బస్సులను ఊబర్ సంస్థ నడపనుంది. ఈ మేరకు దిల్లీ రవాణా మంత్రిత్వ శాఖ నుంచి తాజాగా లైసెన్స్‌ అందుకుంది. ఈ తరహా లైసెన్స్‌ జారీ చేసిన తొలి రవాణా శాఖ దిల్లీనే. దీన్ని అందుకున్న తొలి అగ్రిగేటర్‌గా ఉబర్‌ నిలిచింది.ఏడాదిగా దిల్లీ-ఎన్‌సీఆర్‌తో పాటు, కోల్‌కతాలోనూ ప్రయోగాత్మకంగా ఈ సేవలు నడుపుతున్నామని ఉబర్‌ షటిల్‌ ఇండియా హెడ్‌ అమిత్‌ దేశ్‌పాండే చెప్పారు. దిల్లీలో బస్సులకు విపరీతమైన డిమాండ్‌ ఉన్నట్లు గమనించామన్నారు.  ఇప్పుడు అధికారికంగా తమ సేవలను దిల్లీలో ప్రారంభించ. బోతున్నామని తెలిపారు. బస్సు సర్వీసులకు వారం ముందు నుంచే ప్రయాణికులు బుక్‌ చేసుకోవచ్చని ఉబర్‌ తెలిపింది. బస్సు రాబోయే సమయం, బస్సు లైవ్‌ లొకేషన్‌, బస్సు రూట్లను ఎప్పటికప్పుడు ఉబర్‌ యాప్‌లో తెలుసుకోవచ్చని పేర్కొంది. ఒక్కో సర్వీసులో 19-50మంది ప్రయాణించడడానికి వీలుంటుందని తెలిపింది. ఉబర్‌ టెక్నాలజీ సాయంతో స్థానిక ఆపరేటర్లు వీటిని నడుపుతారని ఊబర్‌ తెలిపింది.

Related posts

కరోనా కేసులు పెరుగుతున్న దేశాలివే.. టూరిస్టులు జాగ్రత్త..!!

TV4-24X7 News

కొత్తపల్లి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోలకు మధ్య ఎదురు కాల్పులు

TV4-24X7 News

జూలైలో రూ.20 లక్షల కోట్లు దాటిన UPI పేమెంట్స్

TV4-24X7 News

Leave a Comment