Tv424x7
Andhrapradesh

బంగారు భవితకు పునాదులు వేయండి ఆరిలోవ యువతకు సీఐ దిశనిర్దేశం

విశాఖపట్నం ఆరిలోవ నేటి కంప్యూటర్ యుగంలో యువత తమ భవిష్యత్తుపై నిర్దిష్టమైన ఆలోచనలను, ఉన్నతమైన గోల్స్ని పెట్టుకుని తమ జీవితాలను బంగారు భవిష్యత్తు బాటలో నడిచేలా చూసుకోవాలని ఆరిలోవ పరిసర ప్రాంత యువతకు ఆరిలోవ సిఐ జి.గోవిందరావు దిశా నిర్దేశం చేశారు. ఆరిలోవ కాలనీలో ఉన్న యువతతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యువత చెడుదారులు పట్టకుండా చదువు మీద దృష్టి పె ట్టి, క్రీడాలపైన మామకారం పెంచుకుని భవిష్యత్తులో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. గంజాయి డ్రగ్స్, మద్యపానానికి యువత దూరంగా ఉండాలని అటువంటి వారి సహవాసాలకు చెక్ పెట్టాలని సూచించారు. యువత అల్లర్లకు పాల్పడడం లేదా ఈవ్ టీజింగ్లకు అలవాటు పడితే అనర్ధాలు కొని తెచ్చుకోవలసిన ప్రమాదం ఏర్పడుతుందని, మంచి ఆలోచనలతో స్నేహభావంతో ఉన్నతమైన ఆశయాలు కలిగి యువత జీవించాలని, తల్లిదండ్రుల కలలను సహకారం చేయాలని ఈ సందర్భంగా ఆయన యువతకు హితోపదేశం చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో యువకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Related posts

రేపు ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు..!

TV4-24X7 News

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ భృతి పథకం

TV4-24X7 News

డ్రోన్ల తో గంజాయి పై యుద్ధం.. బాబు సక్సెస్

TV4-24X7 News

Leave a Comment