Tv424x7
Andhrapradesh

ఎంఐజి లేఔట్ ను పరిశీలించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

రాయచోటి, మధ్య తరగతి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిర్మిస్తున్న ఎం ఐ జి లేఅవుట్ పనులు త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి ఎం ఐ జి లేఔట్ ను పరిశీలించారు.ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మందడిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ…. మధ్యతరగతి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్మిస్తున్న ఎంఐజి లేఔట్ లో పనులు త్వరితగతను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.రాయచోటి పట్టణ పరిసర ప్రాంతం దిగువ అబ్బవరం దగ్గర నిర్మిస్తున్న ఎం ఐ జి లేఅవుట్ కు సంబంధించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పైప్ లైన్, రోడ్లు నిర్మాణం, వంటి పనులు వేగవంతం చేయాలన్నారు.ఎంఐజీ లేవుట్ తో పట్టణ ప్రాంతాల్లోని మధ్య తరగతి ప్రజల సొంతింటి కల నెరవేరుతుందని అధికారులు త్వరితగతిన లేఅవుట్ పనులు పూర్తి చేయాలన్నారు.

Related posts

స్వచ్చ సర్వేక్షన్ లో భాగంగా స్థానిక మారుతీ నగర్ లో ప్రజలకు అవగాహనా కార్యక్రమం

TV4-24X7 News

సింహాచలం బాధిత కుటుంబాలకు వైస్సార్సీపీ ఆర్థిక సాయం

TV4-24X7 News

ప్రొద్దుటూరు షాపింగ్‌మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం

TV4-24X7 News

Leave a Comment