Tv424x7
Andhrapradesh

ఎంవీపీ సర్కిల్ ఇన్స్పెక్టర్గా మురళీ

విశాఖపట్నం ఎంవీపీ నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ జె.మురళీ శుక్రవారం ఉదయం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు విశాఖ నగర పోలీసు కమీషనర్ డాక్టర్ శంకబత్ర బాగ్చి ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకు ముందు విజయనగరం డీసీఆర్బీ నుంచి బదిలీపై వచ్చారు. 1998 బ్యాచ్ కు చెందిన సి.ఐ.మురళీ సిటీ పరిధిలో పెందుర్తి, ఎయిర్ పోర్ట్, గాజువాకలో విధులు నిర్వర్తించారు. ఈ సందర్భంగా ఎంవీపీ పోలీసు స్టేషన్ సిబ్బంది తమ నూతన సి.ఐ కి పుష్పగుచ్ఛం అందజేసి సాదర స్వాగతం పలికారు. అనంతరం సి.ఐ.మాట్లాడుతూ సర్కిల్ పరిధిలోని ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎలాంటి సమస్యలు లేకుండా శాంతిభద్రతలు పరిరక్షించాలని సిబ్బందికి సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతి భద్రతలు పరిరక్షించడం జరుగుతుందని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇంతవరకు సి.ఐ.గా ఉన్న సంజీవరావును రేంజ్ కు సరెండర్ అయ్యారు.

Related posts

నేడు పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది

TV4-24X7 News

షర్మిలను గెలిపించండి: విజయమ్మ

TV4-24X7 News

అన్నమయ్య జిల్లాకు కొత్త ఎస్పీ ధీరజ్ కునుబిలి!!

TV4-24X7 News

Leave a Comment