విశాఖపట్నం శ్రీ స్వామి వివేకానంద సంస్థ వారు, వివేకానంద సంస్థ నిర్వహిస్తున్న ఉచిత ట్యూషన్ సెంటర్లో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు విద్యతో పాటు, ఆధ్యాత్మిక భావనలు, సాంప్రదాయ నృత్య ప్రదర్శనలను బోధిస్తూ, అన్ని రంగాలలో విద్యార్థులను తీర్చి దిద్దుతున్న వివేకానంద సంస్థ వారిని అభినందించిన ద్రోణం రాజు. శశి అమ్మగారు, అనంతరం విద్యార్థులకు పురాణ ఇతిహాసాలపై అవగాహన కల్పిస్తూ, విద్యార్థులకు బహుమతులను అందజేశారు. అనంతరం శశి అమ్మ ని ఘనంగా సత్కరించిన వివేకానంద సంస్థ సభ్యులు. ఈ సందర్భంగా శ్రీవత్సవ మాట్లాడుతూ, పలు సేవా కార్యక్రమాలతో పాటు, విద్యార్థులకు అన్ని రకాలుగా చేయూతనిస్తూ, అన్ని రంగాలలో ముందుకు నడిపిస్తున్న సంస్థ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు అప్పారావు, సంస్థ సీనియర్ సభ్యులు గజపతి స్వామి,పి . ఈశ్వరరావు మరియు ట్యూషన్ విద్యార్థులు పాల్గొన్నారు.
