Tv424x7
Cinima News

దేవర ఓటీటీ రిలీజ్ అప్‌డేట్.. అప్పటివరకూ ఆగాల్సిందే

దేవర ఓటీటీ రిలీజ్‌ అప్‌డేట్ నెట్‌ఫ్లిక్స్‌లో రానున్న దేవర

అప్పటివరకూ ఆగాల్సిందే అంటూ వార్తలు ఎన్టీఆర్‌ దేవర విడుదలకు రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని చోట్ల అడ్వాన్స్ బుకింగ్‌ మొదలైంది. యూఎస్లో ఇప్పటికే సినిమాకు రెండు మిలియన్ల డాలర్ల వసూళ్లు నమోదు అయ్యాయి. విడుదల రోజు వరకు ఆ మొత్తం రెండున్నర మిలియన్ డాలర్లకు చేరే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్‌ ఇండియాలో, తమిళనాడు, కర్ణాటకలో భారీ వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక సినిమా థియేటర్లలో ఎక్కువ రోజులు ఆడే అవకాశం ఉంది. అందుకే ఓటీటీ స్ట్రీమింగ్‌ ను ఆలస్యం చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు.చిత్ర యూనిట్‌ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే దేవర సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ హక్కులను నెట్‌ ఫ్లిక్స్ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. అయితే సినిమాను 7 వారాల తర్వాతే స్ట్రీమింగ్‌ చేయాలనే కండీషన్ ను పెట్టినట్టు సమాచారం అందుతోంది. ఇటీవల విడుదల అయిన ప్రభాస్ కల్కి సినిమాను సైతం చాలా ఆలస్యంగా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. అదే తరహాలో దేవర సినిమానూ ఓటీటీ లో 7 వారాల తర్వాతే స్ట్రీమింగ్‌ చేయాలని నిర్ణయించుకున్నారు. సినిమా ఫలితం పై మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. అందుకే ముందస్తుగానే నెట్‌ ఫ్లిక్స్ తో ఏడు వారాల కండీషన్ తో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది.సాధారణంగా మూడు నాలుగు వారాల్లోనే సినిమా ఓటీటీ లో వస్తుంది కదా అని చాలా మంది ప్రేక్షకులు థియేటర్ల వైపు వెళ్లడం లేదు. కానీ దేవర సినిమా ఓటీటీ లో రావడానికి చాలా సమయం ఉందనే ఉద్దేశ్యంతో కచ్చితంగా థియేటర్‌ లకు వెళ్లి చూసే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది అని నిర్మాతలు భావిస్తున్నారు. అందుకే ఏడు వారాల విషయాన్ని కాస్త ఎక్కువగా ప్రచారం చేయాలని పీఆర్ టీం తో చిత్ర నిర్మాణ సంస్థ ప్రతినిధులు అన్నట్లుగా తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్‌ సినిమా అంటే మినిమం బజ్ ఉంటుంది. కానీ ఆరు ఏళ్ల తర్వాత సోలో హీరోగా ఎన్టీఆర్‌ వస్తున్న నేపథ్యంలో మినిమం బజ్ కాస్త పీక్స్ కి వెళ్లింది. అందుకే అడ్వాన్స్ బుకింగ్‌ కి రికార్డు లు బద్దలు అవుతున్నాయి.ఎన్టీఆర్‌ ఆర్ఆర్‌ఆర్ తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నారు. పైగా ఎన్టీఆర్‌ దేవర సినిమా కోసం ముంబై లో రెండు మూడు రోజులు ఉండి మరీ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అందుకే నార్త్‌ లోనూ సినిమా కుమ్మేయడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సినిమాను నార్త్‌ లో సొంతంగా నిర్మాతలు విడుదల చేయబోతున్నారు. కనుక ఏమాత్రం లాభాలు వచ్చినా నిర్మాతలు సేఫ్‌. నార్త్‌ ఇండియాలో రూ.50 కోట్ల టార్గెట్‌ తో దేవర బరిలోకి దిగబోతున్నాడు. మరి ఏ స్థాయిలో సినిమా ఉంటుంది అనేది చూడాలంటే మరి కొన్ని గంటలు వెయిట్‌ చేయాల్సిందే. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా నటించిన ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఎన్టీఆర్‌ తండ్రి కొడుకులుగా కనిపించబోతుండగా, తండ్రి పాత్రలో కనిపించిన ఎన్టీఆర్‌ కి జోడీగా ఎవరైనా ఉంటారా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ప్రతి పాత్ర చాలా వెయిట్‌ కలిగి ఉంటుందని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌ చెప్పుకొచ్చారు. అందుకే సినిమా రెండు పార్ట్‌ లుగా రాబోతున్నట్లుగా ఎన్టీఆర్‌ పేర్కొన్నారు.

Related posts

ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తోన్న ‘ది కేరళ స్టోరీ’‘

TV4-24X7 News

అతని కోసం సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకున్నా: నయనతార

TV4-24X7 News

‘కూలీ’ అప్డేట్ ఇచ్చిన రజనీకాంత్‌

TV4-24X7 News

Leave a Comment