న్యూ ఢిల్లీ :ఢిల్లీలో నూతన ఏపీ భవన్ ను నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రీ డెవలప్మెంట్ ఆఫ్ ఏపీభవన్ పేరుతో డిజైన్లకు టెండర్లను పిలిచింది. 11.53 ఎకరాల్లో ఏపీ భవన్ నిర్మాణం చేపట్టనుంది. ప్రస్తుతం ఉన్న భవనాలను రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి వినియోగించు కుంటున్నాయి. అయితే ఎన్నికలకు ముందు ఇరు రాష్ట్రాల అధికారులు భవన్ విభజనను ఖరారు చేసుకుని ప్రతిపాదనలు పంపగా కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపింది.

previous post