ఏపీ : సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే సహించేది లేదని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఆడబిడ్డల జోలికొస్తే ఊరుకోబోమన్నారు. ‘వైసీపీ నేతల భార్యలు, కూతుర్లపై అసభ్యకర పోస్టులు పెట్టినా వదలను. మృగాళ్లా ప్రవర్తించొద్దు. రౌడీలు, నేరస్థులు వేసుకున్న రాజకీయ ముసుగు తీస్తా. కొందరు పోలీసులు లాలూచీ పడితే వారికదే లాస్ట్ డే. టెక్నాలజీని ప్రమోట్ చేసింది నేనే. నా దగ్గర మీ కథలేంటి. బీ కేర్ ఫుల్’ అని హెచ్చరించారు.