Tv424x7
National

డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించే యోచనలో కేంద్ర ప్రభుత్వం

హైదరాబాద్:డిసెంబర్ 09 దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతాయా? త్వరలోనే ప్రజలకు గుడ్ న్యూస్ అందుతుందా? అంటే అవుననే సమాధా నాలు వినిపిస్తున్నాయి ప్రజల ఖర్చుల్లో పెట్రోల్, డీజిల్ కే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఈ ధరలు నిత్యం పెరుగు తుండంతో ప్రజా రవాణా కూడా భారంగా మారుతోంది. ఈ క్రమంలోనే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించి.. ప్రజలపై ఆర్థిక ఒత్తిడిని తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా సన్నాహాలను ప్రారంభించిం ది. దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురుపై విధిస్తున్న విండ్ ఫాల్ ట్యాక్స్ ను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. దీంతో రానున్న రోజుల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని అర్థమౌతోంది. ఈ ధరలు దిగివచ్చే అవకాశం ఎక్కువగా ఉందని నిపు ణులు సైతం చెబుతున్నా రు. కాగా ప్రభుత్వం చివరిసారిగా మార్చిలో ఇంధన ధరలను సవరిం చింది. రూ. 2 వరకు తగ్గించింది….అప్పటి నుంచి ధరలు అలాగే కొనసాగుతు న్నాయి. కాబట్టి ఈ కొత్త తగ్గింపు అంతకంతకూ పెరుగుతున్న ఇంటి, వ్యా పార ఖర్చులను తగ్గించి ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. మరోవైపు పెట్రోల్ పంప్ ఆపరేటర్లకు డీలర్ కమిషన్లను పెంచా లని ప్రభుత్వం, ఆయిల్ కంపెనీల మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో చాలా కాలంగా ఉన్న పెట్రోల్ పంప్ ఆపరేటర్ల డిమాండ్ నెరవేరినట్లయ్యిం ది. చెప్పినట్లుగా డీలర్ల కమిషన్లను ప్రభుత్వం పెం చింది. కాగా నేడు పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు లేదు. పెట్రోల్ ధర రూ. 107.46 , డీజిల్ ధర రూ. 95.70 గా ఉంది. కొత్త సంవత్సరం నుండి ఈ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది.

Related posts

నటికి వేధింపులు – కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ సస్పెండ్ !

TV4-24X7 News

చెప్పుల వ్యాపారి ఇంట్లో రూ.100 కోట్లు సీజ్

TV4-24X7 News

సీఏఏ అమలుపై స్పందించిన తలపతి విజయ్..

TV4-24X7 News

Leave a Comment