అనకాపల్లి :ఏపీలోని అనకాపల్లి జిల్లాలో రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో మెస్సర్స్ ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కానున్నట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. రెండు దశల్లో 17.8 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి చేసే లక్ష్యంతో నిర్మాణం జరుగుతుందన్నారు. మొదటిదశలో రూ.55,964 కోట్ల పెట్టుబడి, రెండో దశలో రూ.80వేల కోట్ల పెట్టుబడితో నిర్మాణాలు జరుగుతాయని అన్నారు. వీటి ద్వారా 55 వేల ఉద్యోగాలు లభిస్తాయని అంచనావేశారు.

previous post