Tv424x7
Andhrapradesh

వైఎస్ జగన్ కు బిగ్ షాక్.. విశాఖలో వైసీపీ సీనియర్ నేత గుడ్ బై..!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి విశాఖపట్నం కి చెందిన సీనియర్ నేతగా ఉన్న చొక్కాకుల వెంకటరావు వైసిపి ప్రాథమిక సభ్యత్వానికి, రాష్ట్ర కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. నిన్న రాత్రి తన రాజీనామా పైన ఒక ప్రకటన విడుదల చేసిన ఆయన రాజీనామా లేఖను వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి పంపినట్టు పేర్కొన్నారు.

విశాఖలో వైసీపీకి షాక్ అయితే త్వరలోనే ఆయన ప్రస్తుత అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి పార్టీలలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. ఈ విషయంపైన ఆయన ఎటువంటి ప్రకటన చేయలేదు.2013లో విశాఖ ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాడు. విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్తగా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన చొక్కాకుల ఓటమిపాలయ్యారు. అప్పుడు బిజెపి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం బిజెపిలో చేరారు.

జగన్ పాలనలో వీకేపీసీపీసీఐఆర్‌యూడీఏ చైర్మన్ గా అవకాశం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేసిన ఆయన బిజెపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019లో వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకట్రావు భార్య లక్ష్మికి విశాఖపట్నం, కాకినాడ పెట్రోలియం కెమికల్ అండ్ పెట్రో కెమికల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్ పర్సన్ గా జగన్ అవకాశాన్ని కల్పించారు. ఆ తర్వాత చొక్కాకుల కూడా అదే సంస్థకు చైర్మన్ గా పనిచేశారు.

Related posts

ఆంధ్రప్రదేశ్ ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ ఫలితాలు విడుదల..

TV4-24X7 News

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఏడు సీట్లలో టీడీపీ అభ్యర్థులు ఖరారు

TV4-24X7 News

తాడిపత్రి నుంచి పెద్దారెడ్డి, ప్రభాకర్ రెడ్డి తరలింపు..

TV4-24X7 News

Leave a Comment