Tv424x7
Andhrapradesh

ఆంధ్రప్రదేశ్ ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ ఫలితాలు విడుదల..

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం 2023-24 విద్యా సంవత్సరానికి గానూ పదోతరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. ఈ మేరకు సార్వత్రిక విద్యాపీఠం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన పరీక్షలకు హాజరైన విద్యార్ధులు ఏపీ ఓపెన్‌ స్కూల్‌ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చని తెలిపారు.మార్కుల మెమోలను సంబంధిత స్టడీ కేంద్రాల్లో తీసుకోవచ్చని తెలిపారు.కాగా ఏడాది ఓపెన్‌ స్కూల్‌ పదో తరగతి పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 32,581 మంది హాజరుకాగా.. ఇంటర్మీడియట్‌ పరీక్షలకు 73,550 మంది విద్యార్థులు హాజరయ్యారు. తాజా ఫలితాల్లో ఓపెన్‌ స్కూల్‌ పదో తరగతిలో 18,185 మంది అంటే 55.81 శాతం ఉత్తీర్ణత పొందారు. ఇంటర్‌లో 48,377 మంది అంటే 65.77 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు తెలిపారు.

Related posts

నకిలీ భారత పాస్‌పోర్టును ఉపయోగించి రష్యాకు వెళ్లిన బంగ్లాదేశ్ వ్యక్తి అరెస్ట్

TV4-24X7 News

24 నుంచి ఏపీ అసెంబ్లీ – జగన్‌కు మంచి చాన్స్ !

TV4-24X7 News

కడప పర్యటనలో కార్యకర్తలకు భరోసా ఇచ్చిన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి

TV4-24X7 News

Leave a Comment