భారత్ పై దాయాది దేశం పాకిస్థాన్ మరో కుట్రకు పాల్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పాక్ తన పౌరులను నేపాల్ ద్వారా భారత్కు పంపిస్తుందని తెలుస్తోంది. వారిలో బంగ్లాదేశీయులు కూడా ఉన్నట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు భారత్-నేపాల్ సరిహద్దుల్లో నిఘాను పెంచారు. నేపాల్ నుంచి వచ్చే ప్రతీ ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి. అలాగే అటవీ ప్రాంతాల్లో భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి.
