Tv424x7
Andhrapradesh

ఆధ్యాత్మిక శ్రీ కూర్మ గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో దురుద్దేశమా..? కదా…?

ఆధ్యాత్మిక శ్రీ కూర్మ గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో దురుద్దేశం లేదు

ఘటన పై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నా:జిల్లా ఎస్పీ శ్రీ కె.వి మహేశ్వర రెడ్డి ఐపిఎస్

శ్రీకాకుళం : పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండలం అంతకాపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఆధ్యాత్మిక కేంద్రం శ్రీ కూర్మ గ్రామంలో మంగళవారం (10.06.2025) రాత్రి జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో ఎటువంటి దురుద్దేశం లేదు అని, ఈ ఘటన పై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టడం జరుగుతుంది అని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శ్రీ కె.వి మహేశ్వర రెడ్డి ఐపీఎస్ తెలిపారు. హిరమండలం పరిధిలో గల సనాతన ఆధ్యాత్మిక కేంద్రం శ్రీకూర్మం గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాద ఘటనలో వ్యక్తిగతంగా, అల్లరి మూకలు ప్రమేయం లేదు అని, కూర్మ గ్రామ సభ్యులు ప్రతిరోజు దీపాలు వెలిగించి పూజ చేసుకున్న అనంతరం దీపాలు ఆర్పి వేసి వెళ్లి పోతాము అని చెప్పినప్పటికీ ఏదైనా దీపం పొరపాటున పూర్తిగా ఆగకపోయి ఉన్నట్లయితే దాని వలన ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రస్తుతానికి భావిస్తూ ఉన్నాము అని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటికే ప్రమాద స్థలంలో భౌతిక ఆధారాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ విజయవాడకు పరీక్షలు నిమిత్తం పంపించడం జరిగిందని, సాంకేతిక ఆధారాలు బట్టి అన్ని కోణాల్లో ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో భాగంగా ఘటనకు దీపాల వలన జరిగిన అగ్ని ప్రమాదమే ప్రధాన కారణమని, అవాస్తవాలు వదంతులు ప్రజలు ఎవరూ నమ్మవద్దని, అవాస్తవాలు ప్రచారం చేసిన వారిపై చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు.

Related posts

కడపజిల్లాలో పాఠశాల గేటుకు ఉరేసుకుని వ్యక్తి మృతి

TV4-24X7 News

పోలీసుల విస్తృత తనిఖీలు గంజాయి అక్రమ రవాణా అరికట్టేందుకు చర్యలు

TV4-24X7 News

చిన్నసింగనపల్లి గ్రామంలో 40 కుటుంబాలు టీడీపీ పార్టీ లోకి చేరిక

TV4-24X7 News

Leave a Comment