మంగళగిరి:మహిళల భద్రతకు “శక్తి వాట్సప్ నంబర్” 79934 85111 ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. మంగళగిరి లోని డీజీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన శక్తి వాట్సప్ ను ప్రారంభించారు. ఈసందర్భంగా జరిగిన కార్యక్రమంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ మహిళలు, చిన్నారుల భద్రతకు ఏపీ పోలీస్ శాఖతీసుకొచ్చిన “శక్తి” యాప్ అత్యంత ప్రజాదరణ పొందిన సంగతి మనందరికీ తెలిసిందేనని గుర్తు చేశారు.మహిళల భద్రతకు పెద్ద పీట వేస్తూ “ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్” శక్తి వాట్సప్ నంబర్ 79934 85111 అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ఆపదలో ఉన్న మహిళలు శక్తి వాట్సప్ నంబరు కాల్ (వీడియో, నార్మల్ కాల్), మేసేజ్ చేసినా సంబంధిత కమాండ్ కంట్రోల్ రూమ్ కు సంకేతాలు వెళ్లిన వెంటనే శక్తి టీమ్స్ సత్వరమే స్పందించి ఆపదలో ఉన్న మహిళలను ఆదుకోవడం జరుగుతుందన్నారు.24/7 ఈ నంబర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. సాంకేతికత సహాయంతో మహిళలు, చిన్నారులపై జరిగే అఘాయిత్యాలకు చెక్ పెట్టడం జరుగుతుందని తెలిపారు.మహిళలు విధిగా తమ మొబైల్ లో ఈ శక్తి వాట్సప్ నంబర్ ను సేవ్ చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో “ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ ఐజీపీ బి. రాజకుమారి, ఎస్పీ శ్రీదేవి రావు తదితరులు పాల్గొన్నారు.

previous post