జగన్నాథుడి రథయాత్ర ప్రధాని మోదీజీ వీడియో రిలీజ్
జగన్నాథుడి రథయాత్ర సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విట్టర్‌లో ఓ వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియోలో మోదీ మాట్లాడుతూ.. “ప్రతి భారతీయుడికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పవిత్ర పర్వదినం విశ్వాసం, భక్తికి ప్రతీకగా నిలిచి, ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, ఐశ్వర్యం, శుభం, మంచి ఆరోగ్యాన్ని కలిగించాలని ఆకాంక్షిస్తున్నాను. జయ్ జగన్నాథ్” అని చెప్తూ ప్రధాని తన సందేశాన్ని ముగించారు.