ఏపీ: ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా ఇవాళ 880 అడుగులకు నీరు చేరింది. దీంతో రేపు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా డ్యామ్ గేట్లను ఎత్తి నాగార్జునసాగర్కు నీటిని విడుదల చేయనున్నట్లు సమాచారం. నదీ జలాలకు చీరసారెను ఆయన సమర్పించనున్నట్లు తెలిసింది. సీఎం పర్యటనపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

previous post